మసాలా ఉప్మా-స్పెషల్
ఉప్మాను వివిధ రకాలుగా తయారు చేస్తారు. వెజిటేబుల్ ఉప్మా, ప్లెయిన్ ఉప్మా, రవ్వ పులిహోరా ఇలా.. ఉప్మాను రవ్వ లేదా సూజి రవ్వతో తయారు చేస్తారు. ముఖ్యంగా ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. సాధారణ ఉప్మా తిని బోర్ అనిపిస్తే కొంచెం వెరైటీగా కొంచెం కారంగా కొన్ని ఇండియన్ మసాలా దినుసులు వేసి చేసుకోవచ్చు. మసాలా ఉప్మా బెస్ట్ బ్రేక్ ఫ్యాస్ట్. ఎందుకంటే చాలా సులభంగా తయారవుతుంది. మరియు టేస్టీగాను ఉంటుంది. కొద్దిగా వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొంటే మరింత టేస్ట్ గా ఉంటుంది. కావలసిన పదార్థాలు: రవ్వ: 1cup ఉల్లిపాయలు : 2 అల్లం : చిన్నముక్క జీలకర్ర : 1tsp పచ్చిమిర్చి : 4-6 టమోటో: 1(సన్నగా కట్ చేసుకోవాలి) శెనగపప్పు : 2tsp షాజీరా : చిటికెడు దాల్చిన చెక్క : చిన్న ముక్క లవంగాలు : 3 వనస్పతి : 2tsp బిర్యాని ఆకులు : 2 ఆవాలు: 1tsp కరివేపాకు: రెండు రెమ్మలు పసుపు : 1/4tsp నెయ్యి : 2tbsp ఉప్పు : రుచికి తగినంత తయారు చేసే పద్ధతి: 1. ముందుగా ఫ్రైయింగ్...