రుచికరమైన-టమోటో దోసె
భారత్ లో ముఖ్యంగా సౌంత్ స్టేట్స్ లో దోసె బాగా పాపులర్ అయినటువంటి బ్రేక్ ఫాస్ట్ రిసిపి. దోసెలో వివిధ రకాలున్నాయి. దోసెను వివిధ రకాల వస్తువులను వేసి తయారు చేసుకుంటారు. సాధారణంగా మనం తయారు చేసుకొనే దోసె కాకుండా కొంచెం వెరైటీగా తయారు చేసుకొనే దోసెలు ప్రతి రోజూ మనల్ని టెప్ట్ చేస్తుంటాయి. ఇలా వెరైటీ దోసెలను చాలా ప్రదేశాల్లో సర్వ్ చేస్తారు. దాంతో పాటు, చట్నీ సాంబర్ చాలా రుచిగా ఉంటాయి.
దోసెను ప్లెయిన్ దోసెగాను లేదా వెరైటీగాను తయారు చేసుకోవచ్చు. దోసె రకాల్లో 80 వరకూ ఉన్నాయి. వివిధ వెరైటీల్లోని దోసెలు ఫుడ్ సెంటర్లలో దొరకడం మనం చూస్తూనే ఉంటాం. టమోటో దోసెను మీరు కనుక ట్రై చేయనట్లైతే ఒక సారిట్రై చేసి రుచి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది.
దోసె పిండి: 2cups
టమోటోస్: 2
పచ్చిమిర్చి: 3-4
జీలకర్ర: 1tsp
అల్లం పేస్ట్: 1tsp
ఉప్పు: a pinch

కావల్సిన పదార్థాలు:
దోసె పిండి: 2cups
టమోటోస్: 2
పచ్చిమిర్చి: 3-4
జీలకర్ర: 1tsp
అల్లం పేస్ట్: 1tsp
ఉప్పు: a pinch
తయారు చేయు విధానం:
1. ముందుగా అల్లం, టమోటో, పచ్చిమిర్చి మరియు జీలకర, కొద్దిగా ఉప్పు, మిక్సీ గ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ తయారు చేసుకోవాలి.
2. ఇప్పుడు దోసె పిండిలో టమోటో పేస్ట్ మిక్స్ చేసుకోవాలి.
3. ఇప్పుడు దోసె పాన్ స్టౌ మీద పెట్టి వేడి చేసి, నూనె రాసి, దోసె పిండిని దోసెలా పాన్ మీద వేసుకోవాలి. తర్వాత దాని మీద కొద్దిగా నూనె చిలకరించాలి.
4. దోసె ఒక సైడ్ కాలిన తర్వాత మరో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. అంతే టమోటో దోస రెడీ. దీన్ని చట్నీ లేదా సాంబార్ తో సర్వ్ చేయాలి.
Comments
Post a Comment